<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>27</hymn_number>
<title>నాలోని ఆశాజ్యోతి నీవే</title>
<lyrics>[C1]
   నాలోని ఆశాజ్యోతి నీవే - నా ప్రభువా ...
   నీ దరికి నడిపించు నావా - నా జీవనావ

[V1]
 నిను నేను ఈ జగానా కొనియాడనా
 అనువైన పాట పాడి వినుతింపగా
 నీ పద సేవ చేయగ దేవా
 ఎనలేని జీవమును ఒనగోర్చుమయ్యా ...

[V2]
 నా హృదయ ఆలయాన నివసింపుమా
 నీ మహిమ మందిరాన నను నిల్పుమా
 పావన నామా - జీవన ధామా
 నా ఆత్మ దీపమును వెలిగించుమయ్యా...</lyrics>
</song>